Sat Jan 10 2026 23:37:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఆ సిరప్ వాడొద్దు.. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
అల్మాంట్ సిరప్ డ్రగ్ అమ్మకాలను నిలిపేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

దగ్గు, జలుబుకు వాడే అల్మాంట్ సిరప్ డ్రగ్ అమ్మకాలను నిలిపేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అందరు డ్రగ్ ఇన్స్ పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆ సిరప్ మందుల షాపుల్లో ఎక్కడా అందుబాటులో లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సిరప్ వినియోగాన్ని నిషేధించింది.
పిల్లలకు వినియోగించే...
పిల్లలకు వినియోగించే ఈ డ్రగ్ వల్ల అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ డ్రగ్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అందరు డ్రగ్స్ ఇన్స్ పెక్టర్లకు సూచించింది. ఈ అల్మాంట్ కిడ్ సిరప్ లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ అయినట్లు గుర్తించడంతో ప్రజలు కూడా ఈ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని, వైద్యులు కూడా వీటిని సూచించింది.
Next Story

