Wed Jan 21 2026 14:01:25 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్‌లో లైఫ్‌సైన్సెస్ పాలసీ విడుదల
దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం అనేక ఒప్పందాలను కుదుర్చుకుంటుంది.

దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం అనేక ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. వివిధ పారిశ్రామికవేత్తలతో విడతల వారీగా సమావేశమవుతుంది. విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో పెట్టుబడులకు అవకాశాలు, భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వంటి విషయాలను కూడా పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటుంది.
లైఫ్ సైన్సెస్ పాలసీ విడుదల...
దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లైఫ్‌సైన్సెస్ పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. 2030 నాటికి ప్రపంచంలోనే తొలి 5 స్థానాల్లో నిలవాలని, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వ ప్రణాళికలో భాగం.
Next Story

