Wed Mar 04 2026 10:34:27 GMT+0530 (India Standard Time)
Telangana : 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇదే
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు. అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను జిల్లా కలెక్టర్ల ముందు రేవంత్ రెడ్డి ఉంచారు. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరిస్తుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలను నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం ఉంటుంది. మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం జరుగుతుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమాన్ని రూపొందించారు.
గ్రామస్థాయి నుంచి...
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ ను చేపట్టాలి. ఆరోగ్యం, అరైవ్.. అలైవ్, సంక్షేమం, . పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళలు, పర్యావరణం చేపడతారు. మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించనున్నారు
Next Story

