Fri Apr 10 2026 11:54:28 GMT+0530 (India Standard Time)
Telangana : సర్కార్ బడుల్లో తనిఖీలతో హడల్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 299 తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు సుమారు 4,600 పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి...
బోధన నాణ్యత, సిలబస్ పూర్తి, ఉపాధ్యాయుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల ప్రభావంతో ఉపాధ్యాయుల్లో అప్రమత్తత పెరిగింది. పనితీరు లోపాలు ఉన్న చోట నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story

