Thu Apr 02 2026 13:06:09 GMT+0530 (India Standard Time)
Telagnana : విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్గ్రేషియా పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్తు షాక్ కారణంగా రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి ఎనిమిది లక్షలకు పెంచుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్గ్రేషియా అందించాలని ఆయా డిస్కంలను ఆదేశించింది.
రెండు నెలల్లోపే...
ఘటన జరిగిన రెండు నెలల్లోపే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని చెప్పింది. ఎవరైనా పరిహారం అందకపోతే వెంటనే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో 20 లక్షల సన్న, చిన్నకారు, కౌలు రైతుల కుటుంబాలు, 29లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
Next Story

