Sat Dec 13 2025 10:50:07 GMT+0000 (Coordinated Universal Time)
ఈ అర్థరాత్రి నుంచి తెలంగాణలో ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఒమిక్రాన్ వేరియంట్ దెబ్బకు దేశాలే కుదేలయిపోతున్నాయి. ఇక రాష్ట్రాల సంగతి సరేసరి. తమ రాష్ట్రంలో ఆ వేరియంట్ ను ప్రవేశించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పన్నెండు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ రోజు అర్థరాత్రి నుంచే ఈ ఆంక్షలు కొనసాగుతాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
పన్నెండు దేశాలపై...
ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రధానంగా సౌతాఫ్రికాలో వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ ఇక్కడకు రాకుండా అక్కడ నుంచి వచ్చే వారికి విధిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేస్తామని చెప్పారు. ప్రతి చోట థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేస్తామని ఆయన చెప్పారు.
Next Story

