Wed Mar 11 2026 01:23:08 GMT+0530 (India Standard Time)
ఇక పై మాస్క్ లేకుంటే తెలంగాణలో?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈరోజు నుంచే ఇది అమలులోకి రానుంది. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది. రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్స్ కు పంపామని, రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన 239 మంది ప్రయాణికులకు పరీక్షలు చేశామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండాల్సిందే.....
ఒమ్రికాన్ వేరియంట్ తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు చేస్తుంది. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతుంది.
Next Story

