Fri Dec 05 2025 15:54:13 GMT+0000 (Coordinated Universal Time)
Telagana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... వాటికి ఉచిత విద్యుత్తు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందచేయాలని నిర్ణయించింది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందచేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని మండపాలు పెట్టినా అన్నింటికీ ఉచిత విద్యుత్తును అందించాలని కీలకంమైన నరి్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
మండపాలన్నీ రాత్రిపూట...
వచ్చే నెలలో దేవీ నవరాత్రులు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే అన్ని మండపాలకు ఉచిత విద్యుత్తు ను అంద చేయాలని నిర్ణయించింది. మండపాలన్నీ రాత్రి పూట విద్యుత్తు దీప కాంతులతో అలకరించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఎవరూ పైసా చెల్లించాల్సిన పని లేకుండా ఉచిత విద్యుత్తు ను అందించాలని నిర్ణయించింది.
Next Story

