Thu Mar 19 2026 19:58:27 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం 1,190 కోట్ల రూపాయలను మంజూరు చేసింది

తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం 1,190 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. నియోజకవర్గానికి పది కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నియోజకవర్గానికి పది కోట్లు...
అయితే జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతోనే అభివృద్ధి పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గానికి కేటాయించిన పది కోట్ల రూపాయలలో విద్యాసంస్థలకు రెండు కోట్ల రూపాయలు, మంచినీటి సదుపాయానికి కోటి రూపాయలు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

