Fri Dec 05 2025 12:41:56 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు బిగ్ రిలీఫ్
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది.

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్ 1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉ్తత్తర్వుల్లో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో తాము ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలోని గ్రూప్ వన్ ర్యాంకర్ల నియామకాలపై దాఖలయిన పిటీషన్ విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేసింది.
ఈ నెల 15వ తేదీన...
హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో ఈ నెల 15వ తేదీన హైకోర్టులో జరిగే విచారణ తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశమున్నందున సుప్రీంకోర్టు జోక్యానికి నిరాకరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది.
Next Story

