Wed Feb 12 2025 23:09:06 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఈ బస్సుల్లో వారికి ప్రయాణానికి నో పర్మిషన్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 450 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 450 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి ఎక్కువగా మొగ్గు చూపతుండటంతో బస్సుల్లో సీట్లు కూడా దొరకడం లేదు. దీంతో కొత్తగా ఎలక్ట్రికక్ డీలక్ బస్సులను తెలంగాణ సర్కార్ కొనుగోలు చేసింది.
ఆర్టీసీ సిబ్బందికి...
అన్ని ప్రధాన మార్గాల్లో తిరిగే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బందికి ఉచితంగా ప్రయాణించే అవకాశం లేదని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. కార్మిక సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. తమకు కూడా ఈ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి అంగీకరించాలని కోరుతున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.
Next Story