Fri Dec 05 2025 23:16:13 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం గర్భిణి స్త్రీల కోసం మరోకొత్త పథకాన్ని ప్రారంభించింది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లను పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం మరోకొత్త పథకాన్ని ప్రారంభించింది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లను ఈరోజు పంపిణీ చేశారు. గర్భిణి స్థ్రీలకు పౌష్టికాహారన్ని అందించే ఈ పథకాన్ని కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మొత్తం తొలి విడతగా 9 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఎనిమిది జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
రక్త హీనతను నివారించేందుకు....
మొత్తం రెండున్నర లక్షల కిట్లను తొమ్మిది జిల్లాల్లోని గర్భిణి స్త్రీలకు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణులకు ఈ కిట్లు ఉపయోగపడతాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రక్తహీనతను నివారించగలిగితే తల్లి ప్రాణాలను కూడా కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తుందని తెలిపారు.
Next Story

