Sat Dec 06 2025 03:23:31 GMT+0000 (Coordinated Universal Time)
పుండు మీద కారం చల్లినట్లుందిగా
కరవుభత్యాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకవైపు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ పీఆర్సీ కోసం నిరసనలు వ్యక్తం చేస్తుంటే, ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కరవుభత్యాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు 728 శాతంగా ఉండే డీఏను 17.29 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన డీఏ గత ఏడాది జులై నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక్కడ హ్యాపీ అయినా..?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వంపై 300 కోట్ల అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి డీఏ పెంచలేదు. ఒక్కసారిగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం, ఏపీలో ఉద్యోగులు నిరసనలు తెలుపుతుండటం పుండు మీద కారం చల్లినట్లయింది.
Next Story

