Tue Jul 08 2025 18:18:35 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు తీపి కబుు అందించింది. నేత కార్మికుల కోసం ప్రభుత్వం భారీ ఆర్డర్ ను ఇచ్చింది

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు తీపి కబుు అందించింది. నేత కార్మికుల కోసం ప్రభుత్వం భారీ ఆర్డర్ ను ఇచ్చింది. నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం 318 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక జత చేనేత చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీటి తయారీకి సంబంధించిన ఆర్డర్స్ ను తయారు చేయడానికి అవసరమై నిధులను విడుదల చేసింది.
318 కోట్ల విడుదల...
ఈ చీరలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నేత కార్మికులకు ఊరట దక్కినట్లయింది. స్వయం సహాయక సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి జత చేనేత చీరలు నేత కార్మికుల చేత నేయించిన చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అందులో బాగాంగానే 318 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
Next Story