Mon Mar 16 2026 07:24:47 GMT+0530 (India Standard Time)
Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ 2008 అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ 2008 అభ్యర్థులకు మంచి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ 2008 అభ్యర్థులను ఉపాధ్యాయలుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. అయితే హైదరాబాద్ తప్ప ఇతర జిల్లాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది.
డీఈడీ ఉన్న వారికి...
డీఈడీ ఉన్న వారికి ముఫ్పయి శాతం ఎస్జీటీ పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా కేంద్రాల్లో ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు పన్నెండు మంది లబ్ది పొందనున్నారు.
Next Story

