Sun Mar 15 2026 12:08:44 GMT+0530 (India Standard Time)
Telangana Government jobs: : నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షలకు వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది

Telangana Government jobs: :నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షలకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో హామీ ఇచ్చినట్లుగానే నేడు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వయో పరిమితిని పెంచుతూ...
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ వయోపరిమితి పెంపుతో అనేక మంది ప్రయోజనం పొందనున్నారు. వయసు పెరిగి తాము ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత పొందలేమని భావిస్తున్న వారికి ఈ ఉత్తర్వులు ఊరట కల్గించేవే.
Next Story

