Mon Mar 16 2026 06:00:14 GMT+0530 (India Standard Time)
Telangana : పదో తరగతి విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకంది. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు తెలంగాణలో జరగనున్నాయి.
ఐదు నిమిషాల గ్రేస్ టైం...
పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు ఏ మాత్రం టెన్షన్ లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు 18వ తేదీ ఉదయం 9.30 నుంచి ప్రారంభమవుతాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గ్రేస్టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు.
Next Story

