Sat Nov 02 2024 06:26:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : దీపావళికి మరో గుడ్ న్యూస్.. సర్కార్ ఉద్యోగులకు డీఏ విడుదల
దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వోద్యోగులకు, పింఛనుదారులకు తెలంగాణ ప్రభుత్వం డీఏను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పింఛనుదారులకు, ప్రభుత్వోద్యోగులకు డీఏను విడుదల చేసింది. నవంబరు నెల జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సుదీర్ఘకాలంగా...
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీఏ చెల్లింపునకు తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2022 జులై 1వ తేదీ నాటి నుంచి పెరిగిన డీఏ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పింఛనుదారులు కూడా ఖుషీ అవుతున్నారు. వారు కూడా డీఏ పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు
Next Story