Tue Sep 10 2024 12:03:50 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : వారికి గుడ్ న్యూస్ రేపే వారి ఖాతాల్లో పదివేలు జమ
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరద బాధితులకు పది వేల రూపాయలను అందచేయాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరద బాధితులకు పది వేల రూపాయలను అందచేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి ఈ సాయం అందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉప్పొంగండంతో ఖమ్మం పట్టణంలోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మహబూబాబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలతో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి తీవ్ర నష్టం చేకూర్చింది.
సీఎం హామీ మేరకు...
అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద భాదిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వరదల్లో దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన లెక్కను అధికారులు పూర్తి చేసి లబ్దిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపారు. దీంతో పది వేల రూపాయలు వారి ఖాతాల్లో రేపటి నుంచి జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story