Sat Sep 14 2024 10:25:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : శుభవార్త... వారికి ఉచిత విద్యుత్తు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు నుంచే అమలుచేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.
నేట నుంచే అమలు...
ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా విద్యుత్తు ఛార్జీలు చెల్లించకపోవడంతో కొన్ని చోట్ల విద్యుత్తు సిబ్బందిని తొలగిస్తున్నారు. దీనిపై కొందరు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచితంగా నేటి నుంచి విద్యుత్తును అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Next Story