Fri Dec 05 2025 13:43:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై కీలక అప్ డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆన్ లైన్ లోనూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా రేషన్ కార్డుల్లో పేరు, అడ్రస్ మార్పులు చేర్పులు ఉంటే కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
మీ సేవ కేంద్రాల ద్వారా...
మీ సేవ కేంద్రాల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దానికి ఒక సమయం అంటూ ఏమీ లేదని తెలిపింది. అన్నీ అర్హతలు ఉంటే రేషన్ కార్డు ఎంతమందికి ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Next Story

