Sat Dec 07 2024 15:58:29 GMT+0000 (Coordinated Universal Time)
Telagana : తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మేలా? కీడా?
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నూతన విధానంతో కొందరు విద్యార్థులకు ఇబ్బంది అని చెబుతుండగా, మరికొందరు మాత్రం విద్యార్థుల భవిష్యత్ కు మంచిదేనని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రానున్న పదో తరగతి పరీక్షలకు ఇంటర్నల్ మార్కులు అవసరం లేది భావించి వాటిని ఎత్తి వేసింది. ప్రతి ఏడాది టెన్త్ పరీక్షలో వంద మార్కులకు గాను ఇరవై మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.
అభ్యంతరాలు చెబుతున్న తల్లిదండ్రులు...
అయితే ఈ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. రానున్న పరీక్షల నుంచి వంద మార్కులకు పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడింగ్ విధానంలో ప్రస్తుతం ఫలితాలు ఇస్తున్నందున ఇంటర్నల్ మార్కులు తీసివేయాలని ప్రభుత్వం ఆలోచించి వివిధ వర్గాల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. పదో తరగతి లో ఇకపై వంద మార్కులకు పరీక్షను నిర్వహించనున్నారు. అయితే కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నారు.
Next Story