Sun Mar 15 2026 18:19:14 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యేల ఎర కేసు : సుప్రీంకోర్టుకు సర్కార్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ లోనూ సీబీఐ విచారణకు అనుమతివ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ సక్రమంగా జరగడం లేదని, తమకు న్యాయం జరగదని ఆరోపిస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇక్కడ ఎదురుదెబ్బ తగలడంతో...
అయితే తొలుత సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు అనుమతించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
Next Story

