Fri Dec 05 2025 13:18:43 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : చైనాలో హెచ్ఎంపీవీ వైరస్.. అలర్ట్ అయిన తెలంగాణ
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందన్న వార్తలతో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయింది

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుందన్న వార్తలతో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయింది. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. శీతాకాలంలో వచ్చే ఫ్లూ లాంటి వ్యాధి మాత్రమేనని, సాధారణ జలులు, దగ్గు, జ్వరం వంటివి మాత్రమే వస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఈ వైరస్ ఇప్పటి వరకూ తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. దీనిపై ఎలాంటి వదంతులను నమ్మవద్దని కూడా కోరింది. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా రద్దీ ప్రదేశాలకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ తో బయట నుంచి రాగానే శుభ్రం చేసుకోవడం మంచిదని సూచించింది.
మార్గదర్శకాలివే....
తెలంగాణ ప్రభుత్వం చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్తో మీ చేతులను తరచుగా కడగాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ప్రజలు తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలని కూడా కోరింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

