Fri Dec 05 2025 13:16:52 GMT+0000 (Coordinated Universal Time)
Tealangana : గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేసింది

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు తీపికబురు అందించింది. తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. ఒకేసారి 700 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. వీటిలో జీతాలతో పాటు ఇరవై నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బిల్లులు 392 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
పెండింగ్ బిల్లులను...
అన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. గత కొంతకాలంగా ఉద్యోగులు పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరుతున్నారు. ఉద్యోగుల వినతులను పరిశీలించిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులను విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

