Sat Mar 07 2026 16:18:49 GMT+0530 (India Standard Time)
మహిళ ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది, మార్చి 8న సెలవుదినంగా పేర్కొంది

తెలంగాణ ప్రభుత్వం మహిళ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. మహిళ దినోత్సవమైన మార్చి 8వ తేదీన ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులందరికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రయివేటు సంస్థల్లో...
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలకు ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ను ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రయివేటు సంస్థలు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
Next Story

