Tue Mar 10 2026 09:32:10 GMT+0530 (India Standard Time)
Telangana : మహిళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
మహిళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన మహిళ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళ రైతులకు త్వరలోనే డ్రోన్లను పంపిణీ చేయనుంది. మహిళ రైతులను సాంకేతికంగా మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఐదు వందల కోట్ల రూపాయలు ఇందుకు వినియోగిస్తున్నామని తెలిపారు.
డ్రోన్ల పంపిణీతో...
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా మహిళ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తుమ్మల చెప్పారు. మహిళలు వ్యవసాయంలో కీలక భూమిక పోషిస్తున్నారని, వారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఉత్పత్తులు మరింతగా పెరుగుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో అందుకే వారికి డ్రోన్లను అందచేస్తామని తెలిపారు.
Next Story

