Fri Jan 09 2026 20:53:51 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కొత్త వాహనాలను షోరూమ్‌ల్లోనే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఎన్నాళ్లగానో పెండింగ్‌లో ఉన్న డిమాండ్ ఇక నెరవేరనుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అనుమతిస్తూ రవాణా శాఖ గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానం అమలులోకి వస్తే బైక్‌లు, కార్లు కొనుగోలు చేసిన వారు మొదటిసారి రిజిస్ట్రేషన్ కోసం వాహనాలను ఆర్టీఓలకు తీసుకెళ్లాల్సిన పనిలేదు.
రెండు వారాల్లో అమల్లోకి...
ఈ సౌకర్యం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.ఈ మార్పుతో కొత్త వాహన యజమానులకు ప్రక్రియ మరింత సులభమవుతుందని రవాణా శాఖ పేర్కొంది. మే 2024లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.కొత్త విధానం కింద నాన్-ట్రాన్స్పోర్ట్ బైక్‌లు, కార్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా ‘సారథి’ అనే కేంద్ర ఆన్లైన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. రోజుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీఓలపై పనిభారం భారీగా ఉందని, ఈ నిర్ణయంతో కొంత ఊరట లభిస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
Next Story

