Fri Dec 26 2025 13:38:29 GMT+0000 (Coordinated Universal Time)
Telagana : తెలంగాణ రైతులకు అలెర్ట్.. మీ ఖాతాల్లో పన్నెండు వేలు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ రైతులకు అలెర్ట్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం పేర్కొంది. సోషల్ మీడియాలో తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపేస్తున్నట్లు పెద్దయెత్తున ప్రచారాన్ని కొందరు కావాలని చేస్తున్నారని పేర్కొంది. అయితే అందులో నిజం లేదని తెలిపింది. రైతు భరోసా పథకం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాలపై నిరాధారమైన వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని దాదాపు అరవై ఐదు లక్షలమందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది. యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసానిధులను కూడా త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
త్వరలోనే నిధుల విడుదల...
లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీని కూడా నిర్వహిస్తుందని తెలిపింది.అయితే సాగవుతున్నభూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందుతాయని, వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించిన రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని జాబితా నుంచితొలగించేందుకు శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. గత ఏడాది ఈ పథకం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం చెల్లించడానికి ఎలాంటి షరతులు విధించడం లేదని పర్భుత్వం స్పష్టం చేసింది. లబ్దిదారులందరికీ రెండు సీజన్లకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఎకరానికి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story

