Fri Apr 10 2026 11:55:31 GMT+0530 (India Standard Time)
Telangana : వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై 'వాహన్' పోర్టల్ ద్వారా వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
శిక్షణ ఇచ్చిన డీలర్లు...
ఈ క్రమంలో దాదాపు వెయ్యి మంది డీలర్లకు శిక్షణ అందించారు. ఇప్పటికే 671 మంది డీలర్లు రిజిస్ట్రేషన్‌కు అనుమతి పొందగా, దాదాపు 33,000 తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. రేపటి నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ కూడా ప్రారంభం కానుంది. దీంతో వాహనదారులు ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా సేవలు పొందగలరు.
Next Story

