Fri Dec 05 2025 11:30:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు భారీ ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటీషన్ ను కొట్టివేసింది. దీనిపై హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలని, నేరుగా సుప్రీంకోర్టుకు రావడమేంటని ప్రశ్నించింది.
హైకోర్టులోనే...
ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో నేరుగా సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. అయితే ఇది హైకోర్టులో విచారించాల్సిన అంశమని, సుప్రీంకోర్టు కాదని తేల్చి చెప్పి, ఆ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టి వేయడంతో తెలంగాణ సర్కార్ కు ఊరట లభించినట్లయింది.
Next Story

