Fri Dec 19 2025 04:10:30 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నూతన సిట్ ను ఏర్పాటు చేసింది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నూతన సిట్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా నియమించిన సిట్ లో మొత్తం ఐదుగురు ఐపీఎస్ అధికారులతోపాటు మొత్తం తొమ్మిది మందిని నియమించింది.
సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో...
ఈ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ప్రభుత్వం ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. రామగుండం, సిద్ధిపేట పోలీస్ కమిషనర్లు అబర్ కిషోర్ ఝా, విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ఏసీపీ వెంకటగిరి, టీజనాబ్ డీఎస్పీ సిహెచ్ శ్రీధర్, డీఎస్పీ నాగేందర్ రావులు ఇందులో ఉన్నారు.
Next Story

