Fri Dec 05 2025 19:56:14 GMT+0000 (Coordinated Universal Time)
మహిళా ఉద్యోగులకు శుభవార్త.. రేపు సెలవు
ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తోంది. ఈ ఏడాది కూడా మహిళా ఉద్యోగులకు ..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మార్చి 8, మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవు ప్రకటించింది. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తోంది. ఈ ఏడాది కూడా మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ జీఓ జారీ చేశారు. కాగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మహిళా దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన గుర్తింపు వచ్చిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన మహిళలను మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి కలిసి సన్మానం నిర్వహించారు.
Next Story

