Mon Feb 09 2026 22:18:55 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ కుదిరిన ఒప్పందాలు, గ్రౌండ్ అయిన పరిశ్రమల వంటి వాటిపైనే కాకుండా ఇటీవల దావోస్ పర్యటనలో ఒప్పందాలు కుదిరిన వాటిని వేగంగా గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రియల్ టైమ్ డ్యాష్ బోర్డు...
తెలంగాణలో పెట్టుబడుల గ్రౌండింగ్ వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి రెండేండ్లలోనే రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు. ఆయా సంస్థలు, శాఖలను సమన్వయం చేసి పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ డ్యాష్ బోర్డు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రతి శాఖలో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు
Next Story

