Fri Dec 05 2025 12:25:28 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ బడ్జెట్ పై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణ బడ్జెట్ పై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని.. వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయమివ్వాలని 6 నెలలపాటు అసెంబ్లీకి రాలేదని.. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరడతాయన్నారు. కాంగ్రెస్ మోసపూరిత ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని కేసీఆర్ విమర్శించారు.
బడ్జెట్లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదని ఆరోపించారు కేసీఆర్. గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులే లేవన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని.. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదని తెలిపారు.తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని అన్నారు కేసీఆర్.
Next Story

