Sun Feb 01 2026 06:53:40 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్ఎంఎస్లపైనా నిషేధం
మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో సాయంత్రం ఐదుగంటల నుంచి ఎస్ఎంఎస్ లపై నిషేధం అమలు కానుంది

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి ఫుల్స్టాప్ పడనుంది. మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ ఉండటంతో ప్రచారానికి ఈరోజు సాయంత్రం అన్ని రకాలుగా ప్రచారానికి తెరపడనుంది ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
144వ సెక్షన్...
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుంది. ఇక ఎస్ఎంఎస్ల ద్వారా కూడా ప్రచారాన్ని నిర్వహించకూడదని తెలిపింది. స్థానికేతరులు నియోజకవర్గాలను వదలి వెళ్లిపోవాలని పేర్కొంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈవీఎంలను సిబ్బందికి రేపు పంపిణీ చేస్తారు. రేపు సాయంత్రానికి పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకోవాల్సి ఉంటుంది
Next Story

