Fri Mar 13 2026 18:01:21 GMT+0530 (India Standard Time)
ఈఏపీ సెట్ ఫలితాల విడుదల.. మొదటి ర్యాంకు మాత్రం?
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 1.45 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మొదటి ర్యాంక్ ఏపీ విద్యార్థి ప్రణీత్ కు లభించింది. ఇంజినీరింగ్ లో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
వారంలో షెడ్యూల్...
అగ్రికల్చర్ ఫార్మసీ లో 89.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కన్నా మూడు శాతం మంది అధికంగా ఉత్తీర్ణులయినట్లు ఫలితాల తర్వాత అధికారులు వెల్లడించారు. వచ్చే వారంలో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
Next Story

