Thu Mar 19 2026 13:09:16 GMT+0530 (India Standard Time)
ప్రజావాణిపై నేడు మల్లు భట్టి విక్రమార్క సమీక్ష
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రజావాణిపై సమీక్ష చేయనున్నారు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రజావాణిపై సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఎన్ని వచ్చాయి? ఏ రకమైన సమస్యలు వచ్చాయి? వాటికి ఎలా పరిష్కారం కనుగొన్నారన్న దానిపై అధికారులతో చర్చించనున్నారు.
ప్రజా సమస్యలను...
ఆర్థికపరమైన సమస్యలు ఎన్ని? మిగిలిన సమస్యలు ఎన్ని వంటి వాటిపై మల్లు భట్టి విక్రమార్క ఆరా తీయనున్నారు. ఎక్కువ శాతం సమస్యలను పరిష్కరించాలని అధికారులను మల్లు భట్టి విక్రమార్క ఆదేశించనున్నారు. దీంతో పాటు ఈరోజు సాయంత్రం సాయంత్రం ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ ప్లాన్ డిజైన్‌పై సమీక్ష చేయనున్నారు. యాదాద్రి పవర్ స్టేషన్‌పైనా సమీక్షించనున్నారు.
Next Story

