Wed Mar 18 2026 20:04:25 GMT+0530 (India Standard Time)
నేడు దుబాయ్ కు మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రికి దుబాయ్ వెళ్లనున్నారు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఉదయం పదకొండు గంటలకు మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించి ప్రభుత్వానికి మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది.
మౌలిక సదుపాయల కమిటీ...
మౌలిక సదుపాయల కమిటీ ఉప సంఘానికి మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత లభించింది. ఈరోజు రాత్రికి మల్లు భట్టి విక్రమార్క దుబాయ్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story

