Fri Mar 20 2026 01:08:24 GMT+0530 (India Standard Time)
జగన్ పై దాడి అప్రజాస్వామికం : భట్టి విక్రమార్క
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. దాడిచేయడం అప్రజాస్వామికమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైనైనా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
త్వరగా కోలుకోవాలంటూ...
దాడిలో గాయపడిన జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎవరైనా ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చని, అంత మాత్రాన దాడులు ఎవరిపైన చేయడం సరికాదని మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఈ దాడికి ఎవరు పాల్పడినా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
Next Story

