Sat Jan 10 2026 23:28:21 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఆ వీడియోలు చూస్తే కటకటకాలు తప్పవు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. చైల్డ్ పోర్నోగ్రఫీపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఇలాంటి వీడియోలు చూస్తున్న ఇరవై నాలుగు మందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్....
ఇందుకోసం ప్రత్యేకంగా రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ 18 టీమ్స్ చైల్డ్ పోర్న్ చూస్తూ, షేర్ చేస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మంది యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఒకరున్నారని సమాచారం.అరెస్టయిన వారిలో 18 నుండి 48 వయస్సు వారే అధికంగా ఉన్నారని, నిందితులు అంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులుగా ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు.
Next Story

