Thu Mar 19 2026 08:49:34 GMT+0530 (India Standard Time)
సీనియర్ నేతలు హాజరవుతారా?
నేడు తెలంగాణ కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సీనియర్ నేతలు హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొం

నేడు తెలంగాణ కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ కార్యక్రమాలకు సీనియర్ నేతలు హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. దిగ్విజయ్ సింగ్ వచ్చి వెళ్లి పక్షం రోజులు గడుస్తున్నా ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో ఈరోజు జరిగే శిక్షణ తరగతులకు సీనియర్ నేతలు హాజరవుతారా? లేదా? అన్నది పార్టీలో చర్చనీయాంశమయింది.
ఖర్గే ఫోన్ చేసి...
అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీనియర్ నేతలకు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. తాము త్వరలోనే తెలంగాణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కార్యక్రమానికి హాజరై పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని మల్లికార్జున ఖర్గే కోరారు. దీంతో సీనియర్ నేతలు శిక్షణ తరగతులకు వస్తారా? రారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Next Story

