Fri Dec 05 2025 13:18:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రికి రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఆయన కాసేపట్లో ఆసుపత్రికి చేరుకుంటారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర వరంగల్ జిల్లాలో జరుగుతుంది. ఆయన కాసేపట్లో ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యర్ధుల దాడిలో గాయపడిన పవన్ ను పరామర్శిస్తారు. పవన్ కు అవసరమైతే హైదరాబాద్ తరలించి చికిత్స అందించే అవకాశాలున్నాయి. నిన్న కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పవన్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. పవన్ ను పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి ఆసుపత్రికి బయలుదేరి వెళుతున్నారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం...
ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసులు 17 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలపై దాడుల చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. ఎవరినీ వదిలపెట్టబోమని ఆయన అన్నారు. తాము పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని చెప్పారు. వరంగల్ జిల్లాలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర సజావుగా సాగేలా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

