Wed Mar 18 2026 23:15:43 GMT+0530 (India Standard Time)
కోరుట్లలో రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనుంది

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనుంది. గత 25రోజులుగా యాత్ర ఫర్ ఛేంజ్ తో రేవంత్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. తర్వాత 11.30 గంటలకు మెట్పల్లి పసుపు మార్కెట్ ను సందర్శిస్తారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు ముత్యంపేట యాత్ర క్యాంపులో భోజన విరామానికి రేవంత్ రెడ్డి ఆగనున్నారు.
సమస్యలను తెలుసుకుంటూ...
సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది. నాలుగు గంటలకు ధర్మారంలో పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ఐలాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తారు. ఐలాపూర్ కిషన్ం రావుపల్లి మీదుగా కోరుట్ల చేరుకుని రాత్రి ఏడు గంటలకు కోరుట్ల అంబేద్కర్ సర్కిల్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొంటారు. అనంతరం రాత్రికి బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కమ్మర్పల్లిలో రాత్రి బస చేయనున్నారు.
Next Story

