Thu Mar 20 2025 01:31:42 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు కొడంగల్లో రేవంత్ నామినేషన్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరికాసేపట్లో ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పెద్దయెత్తున కార్యకర్తలు కొడంగల్ కు చేరుకున్నారు. తర్వాత తన ముఖ్యమైన అనుచరులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశముంది.
రెండు చోట్ల ఈసారి...
రేవంత్ రెడ్డి ఈ సారి రెండు చోట్ల పోటీ చేయనున్నారు. కొడంగల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని హైకమాండ్ నిర్ణయించింది. కామారెడ్డి లో 10వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పదో తేదీన కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరుకానున్నారు.
Next Story