Thu Mar 19 2026 12:39:09 GMT+0530 (India Standard Time)
రేవంత్ కీలక వ్యాఖ్యలు.. అక్కడి నుంచే పోటీ చేస్తా
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పై స్పష్టత ఇచ్చారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పై స్పష్టత ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. 2009లో తాను కొత్త అయినా కొండగల్ ప్రజలు తనను గెలిపించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
కొడంగల్ నుంచి....
వచ్చే ఎన్నికల్లోనూ కొడంగల్ నుంచి తాను బరిలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించడం విశేషం. రేవంత్ రెడ్డి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలకంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది.
Next Story

