Fri Mar 27 2026 05:01:33 GMT+0530 (India Standard Time)
నేడు కాంగ్రెస్ పోలీస్ కమిషనరేట్ల ముట్టడి
కాంగ్రెస్ పార్టీ నేడు జిల్లా ఎస్పీ కార్యాలయాల ముట్టడికి పిలుపు నిచ్చింది.

కాంగ్రెస్ పార్టీ నేడు జిల్లా ఎస్పీ కార్యాలయాల ముట్టడికి పిలుపు నిచ్చింది. అలాగే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను ముట్టడించనుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ పై కేసులు నమోదు చేయాలని మొన్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అస్సాం ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని కోరారు.
డెడ్ లైన్ విధించినా....
అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసులకు 48 గంటల పాటు డెడ్ లైన్ విధించారు. అస్సాం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయకుంటే తాము పోలీసు కార్యాలయాలను ముట్టడిస్తామని పిలుపు నిచ్చారు. తాను స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముట్టడిలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఇంతవరకూ అస్సాం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో కాంగ్రెస్ నేడు పోలీసు కార్యాలయాల ముట్టడిని చేయనుంది.
Next Story

