Wed Jan 28 2026 22:41:26 GMT+0000 (Coordinated Universal Time)
జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత.. టీపీసీసీ నిర్ణయం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బాధ్యతలను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బాధ్యతలను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డికి అప్పగించిన కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలను మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించింది. మహిళా కాంగ్రెస్, మత్స్యకారుల విభాగాన్ని మహేష్ గౌడ్ కు, భువనగిరి, ఖమ్మం, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అంజన్ కుమార్ యాదవ్ కు, కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతను మహేష్ గౌడ్ కు అప్పగించారు.
వ్యతిరేక గళంతో....
ప్రస్తుతం జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానే కొనసాగనున్నారు. ఇటీవల జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. నిన్న కూడా అసంతృప్త కాంగ్రెస్ నేతల సమావేశంలో పీసీసీీకి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో జగ్గారెడ్డికి ఉన్న అదనపు బాధ్యతలను టీపీసీసీ తప్పించిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి
Next Story

