Fri Mar 20 2026 07:47:56 GMT+0530 (India Standard Time)
నేడు సీఎల్పీ అత్యవసర భేటీ
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్ట ివిక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ప్రధానంగా వనమా రాఘవ అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
రాఘవ అంశంపై....
వనమా రాఘవ అంశంతో అధికార పార్టీ ఇరుకున పడింది. రాఘవను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన గత మూడేళ్లుగా కొత్తగూడెం ప్రాంతంలో చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 12 మంది వనమా రాఘవ బాధితులు ఉన్నారని పోలీసులు చెప్పారు. దీంతో బాధితులకు అండగా ఉంటూ, దీన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సమావేశం జరగనుంది.
Next Story

