Fri Dec 12 2025 09:43:49 GMT+0000 (Coordinated Universal Time)
Congress : గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. రాజ్‌భవన్ కు వెళ్లి తమిళి సై సౌందర్ రాజన్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీ శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలియజేశారు. రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్.బి. స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వారు తెలిపారు.
అందరి సంతకాలతో...
64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్ కు అందించారు. ప్రమాణ స్వీకారం సమయం, వేదికను కూడా గవర్నర్ కు తెలిపి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరవుతారన్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
Next Story

